ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కండి.. ఏపీ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కండి

అమరావతి/హైదరాబాద్:

మెగా సోదరుడు నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, 2019 సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నాగబాబు తనదైన శైలిలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ స్కిట్‌తో వచ్చిన నాగబాబు, తాజాగా 'సైకిల్‌ను తొక్కితే ఆరోగ్యానికి మంచిది' అనే కాన్సెప్ట్‌తో వచ్చారు. ఇక్కడ సైకిల్‌ను తొక్కడం అంటే రాజకీయంగా ఆయన ఉద్దేశ్యం అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీని టార్గెట్‌గా ఈ పోస్ట్ పెట్టి ఉంటారని చెబుతున్నారు. 

విషయానికి వస్తే, తాజా వీడియోలో ఓ చిన్న బాలుడు తన సైకిల్‌ను కిందపడేసి అదేపనిగా తొక్కేస్తుంటాడు. సైకిల్ ముందు చక్రాన్ని, వెనుక చక్రాన్ని, సైకిల్ ఇతర భాగాలను తన కాలితో తంతాడు. అదే సమయంలో మరో బాలుడు ఓ సైకిల్‌ను తొక్కుతాడు. అంటే మొదటి బాలుడు సైకిల్‌ని కాలితో తంతుంటే, రెండో బాలుడు సైకిల్ పైన రౌండ్లు వేస్తాడు. 

    150
Share on :

Disclaimer: Kindly note all videos are taken from YouTube and Official Websites. Fair use under educational and informational purpose. Please contact us if you still have more questions (info[at]apwebtv[dot]com). TV logos and other trademarks are the property of their respective owners.

AP Web TV - Telugu Live TV News & Best Telugu Videos | Powered by AP web tv