పార్కులో పెళ్లి.. ట్విస్ట్ ఇచ్చిన అమ్మాయి తండ్రి, పోలీసులకు ఫిర్యాదు

కండ్లకోయ పార్కులో యువ జంటలకు పెళ్లి చేసిన ఘటనపై అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టాలబ్బాయితో కలిసి పార్కుకెళితే పెళ్లి చేశారని ఆయన ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

కండ్లకోయ పార్కులో యువ జంటలకు పెళ్లి చేసిన ఘటనపై అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చుట్టాలబ్బాయితో కలిసి పార్కుకెళితే పెళ్లి చేశారని ఆయన ఆరోపించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కుకు వచ్చిన ఓ జంటకు పెళ్లి చేయడంపై కేసు నమోదైంది. అమ్మాయి తండ్రి ఈ మేరకు ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు సుష్మారెడ్డి సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతోందని కాంతారెడ్డి జైపాల్ రెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే తన కూతురు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఉదయం 7.45 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిందని పోలీసులకు చెప్పారు. ఉదయం పది గంటలకు ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదన్నారు. తర్వాత తమ దూర బంధువైన రాకేష్‌తో కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కులో సుష్మ పెళ్లి జరిగిన వీడియోను దగ్గరి బంధువు ఒకరు పంపారని ఆయన తెలిపారు.

దీంతో కంగారు పడిన జైపాల్ రెడ్డి తన కూతురు చదువుతున్న కాలేజీకి వెళ్లగా.. ఆమె ఈ రోజు కాలేజీకి రాలేదని సమాధానం వచ్చింది. అసలేమైందో తెలుసుకోవడం కోసం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌కి వెళ్లారు. తమ బంధువైన రాకేష్‌తో సుష్మా పార్కులో ఉండగా.. వారిని ప్రేమికులుగా భావించిన శ్రీహరి చారి, ఆనంద్.. తమ అనుచరులతో కలిసి వారిని అడ్డుకొని అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వారికి పెళ్లి చేశారు. తమ అమ్మాయి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యామన్నారు.

మా అమ్మాయికి ఫోన్ చేసినప్పటికీ.. ఆమె ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉందన్న ఆయన.. నా బిడ్డ ఎక్కడుందో తెలియడం లేదన్నారు. శ్రీహరి చారి, అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

    160
Share on :

Disclaimer: Kindly note all videos are taken from YouTube and Official Websites. Fair use under educational and informational purpose. Please contact us if you still have more questions (info[at]apwebtv[dot]com). TV logos and other trademarks are the property of their respective owners.

AP Web TV - Telugu Live TV News & Best Telugu Videos | Powered by AP web tv