చిన్న సినిమాలపై దిల్‌రాజు సంచలన వ్యాఖ్యలు..

చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని.. ఈ థియేటర్లు మొత్తం ఆ నలుగురి చేతుల్లోనే ఉన్నాయని విమర్శలు వచ్చిన నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ఆ విమర్శలపై స్పందించారు. దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ... ‘కంటెంట్‌ లేని సినిమాలు తీసేవారికి థియేటర్లు కేటాయించి ఏం లాభం... కంటెంట్‌ లేకుండా ఏ చిన్న సినిమా ఆడలేదు. ఏదో సినిమా తీశామన్నట్లు ఉండకూడదు. కేవలం ప్రచార కార్యక్రమాలకు ఎంతకాదన్నా రూ.కోటి వరకు ఖర్చుపెట్టాలి. ఈ విషయాలు అర్థం చేసుకోకుండా చాలా మంది సినిమాలు తీసేస్తున్నారు. థియేటర్లు దొరకట్లేదని అంటున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా చూడండి.. తొలిరోజు ప్రేక్షకుల తాకిడిని చూసి రెండో రోజు నుంచే థియేటర్ల సంఖ్యను పెంచేశారు. ఎందుకంటే ఆ సినిమాకు ఆడియన్స్ సపోర్ట్‌ ఉంది’, సినిమాలో కంటెంట్ ఉందన్నారు.

    231
Share on :

Disclaimer: Kindly note all videos are taken from YouTube and Official Websites. Fair use under educational and informational purpose. Please contact us if you still have more questions (info[at]apwebtv[dot]com). TV logos and other trademarks are the property of their respective owners.

AP Web TV - Telugu Live TV News & Best Telugu Videos | Powered by AP web tv