లవర్స్ డే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Star Cast: ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ రావుఫ్, నూరీన్ షరీఫ్ 

Director: ఒమర్ లులు 


ఇంటర్నెట్ సెన్సేషన్, వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకే ఒకసారి కన్నుగీటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టేసింది. తన మొదటి సినిమా లవర్స్ డే (మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం రికార్డుస్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 2 వేలకుపైగా థియేటర్లలో రిలీజ్ కానున్నది. టీజర్, తాజాగా విడుదలైన లిప్‌లాక్ వీడియో సినిమాపై భారీగా క్రేజ్ పెంచాయి. ఆడియో రిలీజ్‌కు అల్లు అర్జున్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లవర్స్ డే చిత్రం ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియా వారియర్‌కు ఏ రేంజ్ హిట్‌ను అందించింది? తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి ఏ స్థాయి విజయం అందుకోబోతున్నారు? దర్శకుడు ఒమర్ లులు హ్యాట్రిక్ కొట్టాడా? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

ప్రియా వారియర్ (ప్రియా వారియర్), రోషన్ (రావూఫ్ రోషన్) గాథా (నూరీన్ షరీఫ్) అప్పుడప్పుడే కాలేజీలో చేరిన విద్యార్థులు. తొలిచూపులోనే రోషన్, ప్రియా వారియర్ ప్రేమలో పడుతారు. గాథాతో రోషన్, ప్రియా స్నేహంగా ఉంటూ కాలం గడిపేస్తుంటారు. ఈ క్రమంలో వారి జీవితంలో ఓ గొడవ, కొన్ని సంఘటనలు చోటుచేసుకొంటాయి. దాంతో రోషన్‌కు ప్రియా బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత గాథా మనసుకు రోషన్ చేరువవుతాడు. గాథాకు రోషన్ తన ప్రేమను వ్యక్తం చేయాలని నిర్ణయించుకొన్న సమయంలో మరో విషాదం చోటుచేసుకొంటుంది. 

లవర్స్ డే‌లో ట్విస్టులు

ప్రియా వారియర్, రోషన్ మధ్య ప్రేమ వ్యవహారం ఎంత రసవత్తరంగా నడిచింది. అంతా సవ్యంగా ఉందనుకొనే సమయంలో రోషన్‌కు ప్రియా బ్రేకప్ ఎందుకు చెప్పింది. ప్రతీసారి తనను సమస్యల్లోంచి గట్టెక్కించే గాథాతో రోషన్ ప్రేమలో పడ్డాడు. కాలేజీ జీవితంలో కొందరు అకతాయిలతో చోటుచేసుకొన్న గొడవ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. గాథా, రోషన్ ప్రేమ చివరకు ఎలా విషాదంగా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే లవర్స్ డే. 

లవర్స్ డే ఫస్టాఫ్‌ అనాలిసిస్

లవర్స్ డే చిత్రం చక్కటి కాలేజీ వాతావరణంలో ప్రారంభమవుతుంది. సమకాలీన పరిస్థితుల్లో యువతీ, యువకుల మధ్య కనిపించే సరదా, చిలిపి సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. తొలిభాగం కొంత ప్రశాంతంగా, అతి నెమ్మదిగా సాగిపోవడం ప్రేక్షకులకు అసహనం కలిగించేలా ఉంటుంది. ఓ ఫీల్‌గుడ్ అంశంతో సినిమా ప్రథమార్థం ముగిసిపోతుంది. 

లవర్స్ డే సెకండాఫ్ అనాలిసిస్

రెండో భాగంలో లవర్స్ డే చిత్రంలో ఉండే మలుపులతో కూడిన కథ మొదలవుతుంది. బస్ జర్నీలో జరిగిన ఓ సంఘటన కథకు ప్రాణంగా మారుతుంది. కాకపోతే ఎవరూ ఊహించని విధంగా ప్రియా వారియర్, రోషన్ బ్రేకప్ చెప్పుకోవడం, ఆ తర్వాత గాథాతో ప్రేమలో పడటం సినిమాపై ఆసక్తిని రేపుతుంది. చివర్లో ట్రాజెడీ ఎండింగ్‌తో సినిమా ముగియడం భావోద్వేగంగా ఉంటుంది. 

దర్శకుడు ఒమర్ లులు గురించి

దర్శకుడు ఒమర్ లులు బలమైన కథ, సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. కేవలం ప్రియా వారియర్, రోషన్, నూరిన్ నటన, క్రేజ్‌తో సినిమా నిలబడగలిగిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కొత్తవారితో బ్లాక్‌బస్టర్ చిత్రాలు రూపొందించిన ఒమర్ లవర్స్ డే సినిమాకు వచ్చే సరికి తడబాటుకు గురయ్యాడు. ఓదశలో పేలవమైన సన్నివేశాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడా అనిపిస్తుంది. అద్భుతంగా తీయాల్సిన ఓ కథకు అన్యాయం చేశాడనే ఫీలింగ్ కలగడం చాలా సమంజసంగా అనిపిస్తుంది. 

ప్రియా వారియర్ నటనా ప్రతిభ

లవర్స్ డే సినిమాకు కర్త, కర్మ, క్రియ ప్రియా వారియర్. తనకు లభించిన పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసింది. బలహీనంగా కనిపించే సన్నివేశాల్లో కూడా తన హావభావాలతో ఆకట్టుకొన్నది. తెర మీద గ్లామర్‌ను పండించింది. పాటల్లోను డ్యాన్సులతో అలరించింది. తొలిభాగంలో కథ మరింత బలంగా ఉంటే ప్రియ వారియర్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉండేది.

    235
Share on :

Disclaimer: Kindly note all videos are taken from YouTube and Official Websites. Fair use under educational and informational purpose. Please contact us if you still have more questions (info[at]apwebtv[dot]com). TV logos and other trademarks are the property of their respective owners.

AP Web TV - Telugu Live TV News & Best Telugu Videos | Powered by AP web tv